Mobile Popup Ad
Mobile Popup Ad

దుబ్బాకలో పిచ్చి కుక్క హల్చల్.. గంటలో 16 మందిపై దాడి

కలం, మెదక్ బ్యూరో : సిద్ధిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) పట్టణంలో పిచ్చి కుక్క హల్చల్ చేసింది. ఒక గంట వ్యవధిలోనే సుమారు 16 మందిపై దాడి చేసింది. ఇంటి బయట ఉన్న వృద్ధులతో పాటు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న బాటసారులపై కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు కుక్కను తరిమికొట్టి గాయపడిన వారిని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో వీధి కుక్కల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే వీధి కుక్కల బెడద లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>