కలం వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే రిటైర్డ్ ఉద్యోగులు(Retired employees) అసెంబ్లీని ముట్టడించారు. తమ రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ నేడు ఛలో అసెంబ్లీ నిర్వహించారు. పెన్షన్‌దారుల(Pensioners) పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే తమకు పెండింగ్‌లో ఉన్న డీఏలు కూడా విడుదల చేయాలన్నారు. రెండేళ్ల నుంచి తమకు రావాల్సిన డబ్బులు రాకపోవడంతో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. పోలీసులు రిటైర్డ్ ఉద్యోగులను అడ్డుకొని అరెస్ట్ చేశారు.


