Mobile Popup Ad
Mobile Popup Ad

ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) రూరల్ మండలం మాధవ్ నగర్ (పాంగ్రా)లో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణంలో కృషి చేసిన గౌడ సంఘం, గ్రామస్థులను అభినందించారు. ప్రజలు ఐక్యంగా ఉంటూ.. జీవితంలో ఆధ్యాత్మిక భావనను అలవరుచుకోవాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, నియోజవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయరెడ్డి, మోపాల్ సాయరెడ్డి, ఉమ్మాజి నరేష్, తరుణ్, మునిపల్లి సాయి రెడ్డి, ఫిషరీస్ శ్రీనివాస్,ఆకాశ్ రెడ్డి, గ్రామ గౌడ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదగిరి గౌడ్,వేణు గౌడ్, బాల్ రాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>