కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chowdhury) చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్ పుంజుకుంటోందని, అదే సమయంలో బీజేపీకి తగిన బలం లేదని ఆమె ఓ వీడియోలో మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బీజేపీకి తగినంత నాయకులు లేరు కాబట్టే, ఆ పార్టీ కాంగ్రెస్‌ను ఖాళీ చేసేందుకు చూస్తోందనే విషయం వారికి అర్థమైందని సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ప్రజల ఆలోచన కూడా ఇదేనంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. రేణుకా చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అటు కాంగ్రెస్, ఇటు ప్రత్యర్థి పార్టీల మధ్య సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి.
బీఆర్‌ఎస్ (BRS) పుంజుకుంటోందని రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలు పరోక్షంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందా? అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
-బీఆర్‌ఎస్ పుంజుకుంటోందంటూ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు
-ప్రస్తుతం రేణుకా చౌదరి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్
Congress MP Renuka Chowdhury Sparks Debate, Says BRS Picking Up Ground in Telangana#RenukaChowdhury #BRS #Congress #Kalam #KalamDaily #KalamTelugu pic.twitter.com/z053QTSFU0— Kalam Daily (@kalamtelugu) July 15, 2026

