జమ్మికుంటలో విషాదం.. కేబుల్ ఆపరేటర్ బలవన్మరణం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా జమ్మికుంట (Jammikunta) పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కేబుల్ ఆపరేటర్ దాసరి రామ్మూర్తి గౌడ్ (Ramamurthy Goud) రైలు కింద పడి ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. మంగళవారం రాత్రి పట్టణంలోని ధర్మారం రైల్వే పట్టాల వద్ద ఈ దారుణ ఘటన జరిగింది. జీఆర్పీ (రైల్వే) పోలీసుల కథనం ప్రకారం.. రైల్వే పట్టాలపై మృతదేహం ఉన్నట్లు అందిన సమాచారంతో హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కేబుల్ ఆపరేటర్‌గా పనిచేసే రామ్మూర్తి గౌడ్‌గా గుర్తించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>