ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం

ఏపీ మద్యం కుంభకోణం కేసు(Liquor Scam Case)లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. నిందితుల రిమాండ్‌ గడువు నేటితో ముగియనున్నది. అధికారులు వారిని కట్టుదిట్టమైన భద్రత మధ్య విజయవాడ జిల్లా జైలు నుంచి ఏసీబీ(ACB) ప్రత్యేక కోర్టుకు తరలించారు. ఉదయం నుంచి కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు పెంచడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జైలు నుంచి కోర్టుకు తీసుకువచ్చిన వారిలో కేసులో ప్రముఖ నిందితులు రాజ్‌ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌ రెడ్డి(Sajjala Sridhar Reddy), అనిల్‌ చోక్రా, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, వెంకటేశ్‌ నాయుడు, బూనేటి చాణక్య ఉన్నారు. గుంటూరు జైలు నుంచి మరో ఇద్దరు నిందితులు నవీన్‌ కృష్ణ, బాలాజీ కుమార్‌ యాదవ్‌లను కూడా ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. నిందితులపై ఇప్పటికే ఏసీబీ విస్తృత విచారణ జరుపుతూ, భారీ ఆర్థిక లావాదేవీలు, నిధుల మార్పిడి, నెట్‌వర్క్ కార్యకలాపాలపై మరిన్ని సాక్ష్యాలను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో రిమాండ్‌ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టును అభ్యర్థించింది.

విచారణ అనంతరం కోర్టు నిందితుల రిమాండ్‌ను డిసెంబర్‌ 5 వరకు కొనసాగిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఇప్పటికే డిఫాల్ట్‌ బెయిల్ పొందిన నిందితులకు మాత్రం ఈ రిమాండ్‌ పొడిగింపు వర్తించదు. మిగతా వారంతా ఏసీబీ కస్టడీలోనే కొనసాగాల్సి ఉంటుంది. ఈ కేసు(Liquor Scam Case)పై ఇప్పటికే పెద్ద చర్చకు దారితీసింది. రోజురోజుకు కొత్త వివరాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో రిమాండ్‌ పొడిగింపు దర్యాప్తుకు మరింత ఊతమిస్తుందని విచారణ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయేమో వేచి చూడాలి.

Read Also: అమెరికాకు విదేశీ ఉద్యోగులు కావాలి: ట్రంప్

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>