ఇద్దరు యువకుల ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి..!

కలం, వెబ్ డెస్క్ : రీల్స్ పిచ్చి (Reels Craze)తో కొందరు ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవుతామనే ఉద్దేశంతో ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే రీల్స్ మోజులో ఇద్దరు యువకులు తమ ప్రాణాలను కోల్పోయిన ఘటన ఆస్ట్రియాలో చోటు చేసుకుంది. . వ్యూస్, లైక్స్, కామెంట్ల వెర్రితో కొందరు యువకులు ట్రైన్ ఎక్కి వీడియో షూట్ చేసిన క్రమంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.

రీల్స్ లో కొంత సమయం పాటు ప్రమాదకర స్టంట్ ను ఇద్దరు యువకులు పూర్తి చేశారు. ఆ తర్వాత రైలు వంతెనను యువకులు గమనించలేదు. దీంతో రైలు వంతెనను ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటనలో ఓ యువకుడి తల తెగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. రీల్స్ పిచ్చితో (Reels Craze) ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేసి ప్రాణాలు కోల్పోవద్దని వీడియోను చూసిన నెటిజన్లు సూచిస్తున్నారు.

Read Also: సమ్మర్​‌లో పెరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్‌ కేసులు.. ప్రధాన కారాణాలివే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>