జైలులో ఆ పరిస్థితులు భయంకరంగా ఉండేవి: సల్మాన్ ఖాన్

కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) తన తమ్ముడు సోహైల్ ఖాన్‌ను సపోర్ట్ చేయడానికి ఓ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన జైలు అనుభవాలను, తన జీవితంలోని క్రమశిక్షణను గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. షోలో భాగంగా సల్మాన్ ఖాన్ జైలు జీవితం గురించి గుర్తుచేసుకున్నారు. తాను జైలుకి వెళ్లినప్పుడు అక్కడ ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను వివరించారు. ‘‘చిన్న ప్రదేశంలో 50 నుంచి 70 మంది ఉండేవారు. కేవలం ఒకే ఒక ఇండియన్-స్టైల్ బాత్‌రూమ్ ఉండేది. గదిలో బల్లులు కూడా ఉండేవి. అంతమందితో ఒకే బాత్రూం వాడటం అనేది కష్టంగా ఉండేది’’ అని ఓపెన్‌గా మాట్లాడారు.

ఇక అంతకుముందు పాడ్‌కాస్ట్‌లో సల్మాన్ తన నిద్రలేమి, క్రమశిక్షణపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను అలసిపోయాను’ అనే పదానికి తన డిక్షనరీలో తావులేదని, ఎంత అలసట ఉన్నా సరే లేచి పని చేయాలని అభిప్రాయపడ్డారు. రోజుకు కేవలం ఒకటిన్నర నుంచి రెండు గంటలు మాత్రమే నిద్రపోతానని చెప్పాడు. ఎక్కడ ఏ పనిచేయడానికి వీలుండదో (జైలు లాంటి చోట్ల) అక్కడ తాను ప్రశాంతంగా నిద్రపోయినట్లు సల్మాన్ వెల్లడించారు.

సల్మాన్ ఖాన్ జైలు అనుభవాలు అన్నీ 1998 నాటి కృష్ణ జింక హత్య కేసు వివాదానికి సంబంధించినవి. ఈ కేసులో భాగంగా ఆయన 2006లో ఐదేళ్ల జైలు శిక్షను ఎదుర్కొని కొద్ది రోజుల్లోనే బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత 2018లో ఇదే కేసుకు సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయన కొన్ని రోజులు మళ్లీ జైలు జీవితం గడిపి, బెయిల్‌పై విడుదలయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>