కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణ పనులను వేగవంతం చేసి, పూర్తయిన ఇళ్లను గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ (Collector Divakara) అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి హౌసింగ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణ పనుల పురోగతిని ఆయన సమగ్రంగా పరిశీలించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో 10 వేల ఇళ్ల గృహ ప్రవేశాలను లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులకు అన్ని విధాల సహాయం అందించి లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.
జిల్లాలో ఇప్పటివరకు 9,199 ఇళ్లకు స్లాబ్ పనులు పూర్తయ్యాయని, 2,018 ఇళ్లకు ఫినిషింగ్ పూర్తయిందని ఆయన (Collector Divakara) వివరించారు. మొదటి విడతగా 16,497 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు కాగా, ఇప్పటికే 2,520 ఇళ్ళు పూర్తై గృహ ప్రవేశాలు జరిగినట్లు తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ముఖ్యంగా స్లాబ్ దశలో ఉన్న ఇళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రోజువారీగా పనుల పురోగతి ఉండేలా క్షేత్రస్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఇంజనీర్ లు, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణకు మోదీ రాక.. రూ.7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
Follow Us On: Instagram

