Mobile Popup Ad
Mobile Popup Ad

సమ్మర్​‌లో పెరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్‌ కేసులు.. ప్రధాన కారాణాలివే!

కలం, వెబ్​ డెస్క్​: సమ్మర్‌లో ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల ముంబైలో పుచ్చకాయ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడం, గుజరాత్‌లో పెళ్లి భోజనం చేసిన 400 మందికి అస్వస్థతకు గురికావడం లాంటి ఘటనలు కలకలం రేపాయి. ఎండాకాలంలో (Summer) ఉష్ణోగ్రతలు, తేమ పెరగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వృద్ధి చెంది ఆహారం త్వరగా కలుషితమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆహారంలోని క్రిములు రెట్టింపు వేగంతో పెరిగి విషతుల్యంగా మారుతాయి.

ఢిల్లీలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అలీ షేర్ అభిప్రాయం ప్రకారం.. కలుషితమైన ఆహారం, నీటిని తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుందన్నారు. సాల్మొనెల్లా ఈ-కోలి వంటి బ్యాక్టీరియా, నోరోవైరస్ వంటి క్రిములు దీనికి ప్రధాన కారణం. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వచ్చే వైరస్‌, ఇన్ఫెక్షన్లు, అపరిశుభ్రమైన చేతులు, కలుషిత పాత్రల ద్వారా ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. అందుకే వేసవిలో పరిశుభ్రత పాటించడం చాలా కీలకం.

ఫుడ్ పాయిజనింగ్‌కు గురైనప్పుడు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఆహారం తిన్న కొన్ని గంటల్లోనే బాక్టీరియా విడుదల చేసే టాక్సిన్స్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఈ సీజన్‌లో స్ట్రీట్ ఫుడ్, నిల్వ ఉంచిన పదార్థాలు, తక్కువ ఉడికించిన మాంసాహారానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>