కలం, వెబ్ డెస్క్: బ్యాంకుల రుణ ఎగవేత కేసులో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు (Raghurama Krishna Raju) భారీ ఉపశమనం లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. రఘురామకృష్ణంరాజు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాగా, రూ.50 వేల ష్యూరిటీ బాండ్‌పై బెయిల్ మంజూరు చేసి, తదుపరి విచారణ జులై 6కు వాయిదా వేసింది.
అసలు ఏంటీ కేసు..
రఘురామ కృష్ణంరాజు ఛైర్మన్, ఎండీగా ఉన్న ఇండ్-భారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్ అనే కంపెనీ బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.. వాటిని సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకులు నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చాయి. ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు రూ.వేల కోట్ల నష్టం కలిగించారంటూ ఆయనపై సీబీఐ కేసు నమోదైంది. పలువురు కంపెనీ డైరెక్టర్లపైనా కూడా కేసులు నమోదయ్యాయి. నిందితుల ఆస్తులను కూడా అటాచ్ చేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishna Raju) రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్ట్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: సింగర్ మంగ్లీకి బిగ్ షాక్.. మైక్రోఫైనాన్స్ కేసులో కీలక పరిణామం!
Follow Us On : WhatsApp

