సింహం గుర్తుకు ఫుల్ డిమాండ్.. రెబల్స్ అంతా అటువైపే మొగ్గు

కలం, నల్లగొండ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ప్రచార పర్వం ఊపందుకుంది. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ వారికి రెబల్స్‌(Rebels) గా బరిలోకి దిగడం మినహా మరే దారి కన్పించడం లేదు. ఇప్పటికే కొంతమంది రెబల్స్‌ను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతల హామీలిచ్చో.. నయానో.. భయానో ఉపసంహరించుకునేలా చేశారు. కానీ కొంతమంది మాత్రం పోటీ చేసి తీరాల్సిందేనని పట్టుబట్టి కూర్చున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. అయితే ఇలాంటి రెబెల్స్ క్యాండిడేట్ అందరికీ ప్రత్యామ్నాయంగా సింహం  గుర్తు (Lion Symbol) వైపు మొగ్గు చూపుతున్నారు. రెబల్స్‌గా పోటీలో ఉండి ఏదో ఒక గుర్తుపై పోటీ చేయడం కంటే.. సింహం గుర్తుపై పోటీ చేస్తే బెటర్ అనే భావనకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో సింహం గుర్తుపై పోటీ చేసేందుకు అభ్యర్థులు పెద్దఎత్తున ఆసక్తి చూపుతున్నారు.

జాగృతితో అలయన్స్..?

వాస్తవానికి సింహం గుర్తు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి (AIFB) కేటాయించారు. చాలా ఎన్నికల్లో ఈ పార్టీ గుర్తుపై విజయం సాధించిన వారు లేకపోలేదు. గత మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ గుర్తుపై చాలా మున్సిపాలిటీల్లో అభ్యర్థులు గెలిచారు. ఏఐఎఫ్‌బీ ప్రధాన రాజకీయ పార్టీగా స్థానికంగా చలామణిలో లేకపోయినా ఆ పార్టీకి కేటాయించిన సింహం గుర్తు (Lion Symbol) కు మాత్రం మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెబల్స్ అభ్యర్థులకు సింహం గుర్తు ఆశ్రయం కల్పిస్తుంది.

అయితే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితకు చెందిన జాగృతితో ఏఐఎఫ్‌బీ అలయన్స్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. జాగృతి తరపున మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగిన వారందరూ  సింహం గుర్తుపై పోటీ చేస్తున్నారు. అయితే కొన్ని మున్సిపాలిటీల్లో జాగృతి అభ్యర్థులు పోటీలో లేనిచోట ఇండిపెండెంట్లకు సింహం గుర్తుపై పోటీ చేసేందుకు బీ ఫామ్స్ ఇస్తున్నారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది లీడర్లు ఏఐఎఫ్‌బీ నుంచి బీ ఫామ్స్ ఇచ్చేందుకు అభ్యర్థుల నుంచి పార్టీ ఖర్చులు, ఇతరత్రాల పేరు చెప్పి వసూళ్లు చేస్తుండడం చర్చనీయాంశమయింది.

 Read Also: విచార‌ణ‌కు ఎందుకు భ‌య‌ప‌డుతున్నావ్.. కేటీఆర్‌కు క‌విత సూటి ప్ర‌శ్న‌

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>