సీఎం చంద్రబాబుకు మోదీ ఫోన్​.. తుఫాన్​ ప్రభావంపై ఆరా

కలం, వెబ్​ డెస్క్​: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆంధ్రప్రదేశ్​ సీఎం చంద్రబాబుకు ఫోన్​ చేశారు. వారం వ్యవధిలో రాష్ట్రాన్ని రెండు తుఫాన్లు తాకిన నేపథ్యంలో ఫోన్​ కాల్ చేసి ఆరా తీశారు. ప్రకృతి విపత్తు వల్ల జరిగిన నష్టంపై ప్రధాని వివరాలు తెలుసుకున్నారు. తుఫాన్​ ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టంపై మోదీకి చంద్రబాబు వివరించారు. భారీ వర్షాలు, గాలుల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని విన్నవించారు.

రహదారులు, విద్యుత్​ సరఫరా, పంట నష్టంతో పాటు వివిధ రంగాలపై తుఫాన్​ తీవ్ర ప్రభావం చూపించిందని సీఎం వెల్లడించారు. ఏపీకి జరిగిన నష్టంపై కేంద్రం ఆర్థిక సాయంతో పాటు పరిహారం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కాగా, విపత్కర పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రధాని మోదీ అభినందించారు. నిరంతర అప్రమత్తతతో నష్టాన్ని నివారించడంపై ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>