కలం, వెబ్ డెస్క్ : గాంధీ భవన్ (Gandhi Bhavan)కు విచారణ నిమిత్తం రావాల్సిందిగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావులకు పీసీసీ నాయకత్వం సూచించింది. రేపు గురువారం అందుబాటులో ఉండాలని ఇరు నాయకులను కోరింది. ఇటీవల ఢిల్లీలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరగడం, పరస్పర వివాదం చోటుచేసుకోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై లక్ష్మీకాంతరావు ఇప్పటికే పీసీసీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు అధిష్ఠానానికి నివేదించారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సాగిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పీసీసీ, ఇరు వర్గాల వాదనలను ప్రత్యక్షంగా విని వివాదానికి ముగింపు పలకాలనే ఆలోచనతో ఇద్దరినీ గాంధీ భవన్‌కు ఆహ్వానించినట్లు సమాచారం.

