సవాలుగా ‘స్థానిక’ సర్దుబాటు: పవన్ కళ్యాణ్

కలం, వెబ్ డెస్క్ : అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), ఏపీ బీజేపీ అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ సంయుక్తంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రం గతంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ చాలా వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా, దేశవ్యాప్తంగా వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో సుమారు 25 శాతం ఏపీకే వస్తున్నాయని, ఇదంతా కూటమి ప్రభుత్వ సమన్వయం వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు.

అయితే, రాబోయే స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కూటమి పార్టీలకు కొంత సవాలుగా మారిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, జనసేన క్షేత్రస్థాయిలో బలంగా నిలబడిందని, అలాగే బీజేపీకి దేశవ్యాప్తంగా, రాష్ట్రంలోనూ పటిష్టమైన సంస్థాగత బలం ఉందని ఆయన అన్నారు. ఈ మూడు పార్టీల కలయికతో రాష్ట్ర భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు.

Also Read : దూసుకొస్తున్న ‘అర్నబ్‌’.. ఆ జిల్లాలకు హై అలర్ట్ !

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>