కలం, నిర్మల్: ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల నవంబర్ 6న హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నా (Workers Protest) ను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ధర్నాకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్‌కుమార్ మాట్లాడుతూ.. పట్టణాల్లోనూ ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోరిన ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డు ఇవ్వాలని, గ్రామాల్లో వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. కూలీలకు రోజుకు రూ.800 వేతనం చెల్లించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర ఉపాధి హామీ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ధర్నాకు కూలీలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Also Read : భారత్‌లో లీటెన్‌స్టైన్ ప్రిన్స్ అలోయిస్ పర్యటన
Follow Us On: Instagram

