పాల్వంచలో ఘోర ప్రమాదం.. సింగరేణి ఉద్యోగి మృతి!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha) లో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లగేజ్ డోర్ ఢీకొన్న ఘటనలో ఓ సింగరేణి ఉద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

​వివరాల్లోకి వెళ్తే.. మణుగూరు పీకే ఓసీ-2 బొగ్గు గని బ్లాస్టింగ్ సెక్షన్‌లో జనరల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సతీష్ రెడ్డి (40) మంగళవారం తెల్లవారుజామున తన బంధువులను పాల్వంచ సమీపంలోని నవభారత్ బస్టాండ్ వద్ద దింపి, రోడ్డు పక్కన టీ తాగాడు. అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్ నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నవభారత్ సెంటర్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో బస్సు సైడ్ డోర్ సతీష్ రెడ్డికి తగలడంతో ఆయన అదుపుతప్పి వెనక్కి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

​తెల్లవారుజామునే జరిగిన ఈ అనూహ్య ఘటనతో సింగరేణి కార్మిక వర్గంలో, కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పాల్వంచ (Palwancha) పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ఇలాంటి వరుస రోడ్డు ప్రమాదాలు రోడ్డు భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించి వేగ నియంత్రణ పాటించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read : కాళేశ్వరాన్ని ‘కూలేశ్వరం’ చేశారు: హరీష్ రావుపై చామల ఫైర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>