రియల్ మాడ్రిడ్ సూపర్ విక్టరీ: పీఎస్‌వీపై విజయం!

క‌లం, స్పోర్ట్స్: ఛాంపియన్స్ లీగ్‌లో రియల్ మాడ్రిడ్ (Real Madrid) జైత్రయాత్ర కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పోరులో పీఎస్‌వీపై 5-1 తేడాతో రియల్ మాడ్రిడ్ ఘన విజయం సాధించింది. టోర్నీలో వరుసగా ఐదో విజయంతో పట్టికలో అగ్రస్థానానికి చేరింది. అన్ని టోర్నీల్లో కలిపి మాడ్రిడ్‌కు ఇది పదో వరుస గెలుపు. మ్యాచ్ ఆరంభంలో చువామెని చేసిన తప్పిదంతో పీఎస్‌వీకి పెనాల్టీ లభించింది. దీనిని పెరిసిక్ గోల్‌గా మలచడంతో తొలి అర్ధభాగంలో పీఎస్‌వీ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

విరామ సమయంలో కోచ్ మౌరిన్హో చేసిన మూడు మార్పులు మ్యాచ్‌ను మలుపు తిప్పాయి. ఫిట్‌నెస్ సమస్యతో ఫస్టాఫ్‌లో బెంచ్‌పై ఉన్న బెల్లింగ్‌హామ్ సెకండాఫ్‌లో బరిలోకి దిగాడు. ఆట మొదలైన ఐదు నిమిషాలకే వాల్వర్డే గోల్ చేసి స్కోరు సమం చేశాడు. ఆ వెంటనే బెల్లింగ్‌హామ్ అద్భుత వాలీ షాట్‌తో మాడ్రిడ్‌కు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత కైలియన్ ఎంబాపే రెండు గోల్స్ చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. చివర్లో బెల్లింగ్‌హామ్ పాస్‌తో వినిసియస్ జూనియర్ గోల్ చేయడంతో మాడ్రిడ్ 5-1తో జయభేరి మోగించింది.

బెల్లింగ్‌హామ్ రాకతో జట్టులో ప్రశాంతత పెరిగిందని వాల్వర్డే అన్నాడు. విరామ సమయంలో ఆటగాళ్లకు ఏం చెప్పారనేది వెల్లడించేందుకు కోచ్ మౌరిన్హో నిరాకరించారు. ప్రాథమిక అంశాలను సరిగ్గా అమలు చేయడం వల్లే గెలిచామని బెల్లింగ్‌హామ్ తెలిపాడు. తొలి అర్ధభాగంలో వెనుకబడినా, సెకండాఫ్‌లో సమిష్టి ప్రదర్శనతో రియల్ మాడ్రిడ్ సత్తా చాటింది. రాబోయే మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని ఆ జట్టు భావిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>