ఇందిరమ్మ బీమా దరఖాస్తుల్లో తప్పులకు తావులేదు: భాస్కర్ రావు

కలం, యాదాద్రి భువనగిరి జిల్లా: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (Indiramma Bima) దరఖాస్తుల నమోదులో చిన్నపాటి పొరపాట్లకు కూడా అవకాశం ఇవ్వొద్దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు (Bhaskar Rao) అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందాలంటే దరఖాస్తుల నమోదు ప్రక్రియ పారదర్శకంగా, పక్కా వివరాలతో జరగాలని స్పష్టం చేశారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీతో పాటు భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రత్యేక నమోదు కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ, కుటుంబ సభ్యుల వివరాల సేకరణ, నమోదు విధానంపై అధికారులను ఆరా తీశారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నంబర్ ఆధారంగా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారుల నుంచి పూర్తి సమాచారం స్వయంగా సేకరించి, నమోదు చేసిన వివరాలను మరోసారి సరిచూసిన తర్వాతే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

పేర్లలో తప్పులొస్తే ఇబ్బందులు!

కుటుంబ సభ్యుల పేర్లు, ఇతర వ్యక్తిగత వివరాల్లో తప్పులు దొర్లకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు. కేవలం దరఖాస్తులు స్వీకరించడమే లక్ష్యంగా కాకుండా, ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని స్పష్టం చేశారు. అర్హులైన కుటుంబాలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఎంపీఓతో కలిసి వీబీ-జీ రామ్ జీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>