భూముల రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం : కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, బాసర : భూముల రీ సర్వే ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అన్నారు. బుధవారం బాసర మండలం సావర్గం గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. సర్వే సంబంధిత వివరాలను వాకబు చేశారు. గ్రామంలో మొత్తం భూముల విస్తీర్ణం, ఇప్పటివరకు చేపట్టిన సర్వే, ఇంకా పూర్తి చేయాల్సిన సర్వే వివరాలను సమీక్షించారు.

సర్వే బృందంలోని సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి సర్వే ప్రక్రియను చేపట్టాలన్నారు. చేపట్టబోయే రీ సర్వేకు సంబంధించిన సమాచారం ముందుగానే సంబంధిత రైతులకు అందజేయాలని అన్నారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా రీ సర్వే ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలన్నారు. రీ సర్వే పూర్తవగానే సంబంధిత సమాచారాన్ని మొత్తం రైతులకు తెలియజేయాలని పేర్కొన్నారు. రైతులంతా రీ సర్వే ప్రక్రియకు సహకరించాలని కోరారు.

అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా శిబిరాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శిబిరాల నిర్వహణ తీరును పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 18 నుంచి 59 సంవత్సరాల వయసుగల వారంతా బీమా పథకం కింద నమోదు కావాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఏడి ల్యాండ్ సర్వే రికార్డ్ విఠల్, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీవో గంగాసింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>