చైనాతో వివాదంపై భారత్ కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: చైనాతో సరిహద్దు వివాదాలను పూర్తిగా శాంతియుత మార్గంలో చర్చల ద్వారానే పరిష్కరించుకునేందుకు భారత్ కట్టుబడి ఉంటుందని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) కీలక ప్రకటన చేశారు. “చైనాతో దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవల తూర్పు సెక్టార్ సీనియర్ మిలిటరీ కమాండర్ల మధ్య సమావేశం జరిగింది. సరిహద్దుల నిర్వహణలో సమర్థవంతమైన విధానాలను పాటించాలనే అంశంపై ప్రధాన చర్చ జరిగింది. అలాగే, వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న వివిధ సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చనే అంశంపై సమాలోచనలు జరిపారు” అని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్ పరిణామాలపై..

ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని రణధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. “మైనార్టీలపై దాడులు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే ఇలాంటి ఘటనలను నివారించడంతో పాటు మైనార్టీలపై దాడులు చేసినవారిని కఠినంగా శిక్షించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక, అమెరికా నుంచి ఇప్పటివరకు 1700 మంది అక్రమ వలసదారులను భారత్ వచ్చారు. అమెరికా సహా ఏ దేశంలో అయినా అక్రమ వలసలను భారత్ వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో అమెరికాతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. ఇటీవల ఒక వ్యక్తి యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చాడు. అయితే అతను ఏ దేశస్థుడనే విషయంలో అనుమానం వచ్చింది. వెరిఫై చేస్తున్నాం” అని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>