కలం, వెబ్ డెస్క్: నేటి బిజీలైఫ్‌లో చాలామంది ఒత్తిడి, ఆందోళన బారినపడుతున్నారు. ఫలితంగా మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మెదడు చురుగ్గా ఉండాలంటే, కొత్త కొత్త ఆలోచనలు తట్టాలంటే పుస్తక పఠనం (రీడింగ్) అలవాటు చేసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. చదవడం (Reading) వల్ల నాలెడ్జ్ మాత్రమే కాకుండా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. అనేక హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఒత్తిడితో చిత్తవుతున్నారు. వ్యక్తిగత విషయాలు, ఉద్యోగ బాధ్యతలు లాంటివి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. రీడింగ్‌తో ఒత్తిడి స్థాయిలను 68 శాతం తగ్గించుకోవచ్చు. వాకింగ్, మ్యూజిక్ వినడం కంటే రీడింగ్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అలాగే మానసిక ఆరోగ్య (Health) సమస్యలను దూరం చేస్తుంది. ఆందోళన, నిరాశ, మానసిక రుగ్మతలు లాంటివి తగ్గిస్తాయి. అలాగే చదవడంతో మనసు తేలికపడి, హాయిగా నిద్రపోగలుగుతారు. మెదడుకు వ్యాయామం జరగడం వల్ల ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. రీడింగ్‌తో (Reading) బోలెడు ప్రయోజనాలుప్పటికీ టీవీ, మొబైల్స్ కారణంగా చాలామంది దూరంగా ఉంటున్నారు. రీడింగ్ హ్యాబిట్‌ను అలవాటు చేసుకుంటే నిత్యం యాక్టివ్‌గా ఉండొచ్చని చెప్తున్నారు నిపుణులు.
Read Also: స్క్రాప్ నుంచి సూపర్ బైక్.. ఇండియా స్టూడెంట్స్ ఇన్నొవేషన్ అదరహో!
Follow Us On: Youtube


