ఎల్లుండే RCB VS SRH మ్యాచ్.. బీసీసీఐ సంచలన నిర్ణయం

కలం, వెబ్ డెస్క్ : క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ (IPL) సమరానికి కౌంట్ డౌన్ షురూ అయింది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ నెల 28న జరిగే మ్యాచ్‌ తో 19వ ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతుంది. అయితే మెగా టోర్నీ ప్రారంభం అయ్యే రెండు రోజుల ముందు బీసీసీఐ (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్ కు ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించడం లేదని వెల్లడించింది. ఈ మేరకు ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్‌కు ముందు ఎలాంటి వేడుకలు జరగవని స్పష్టం చేసింది.

సాధారణంగా ప్రతి ఐపీఎల్ సీజన్ ప్రారంభ మ్యాచ్ కు ఓ వేడుకను నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలో ప్రముఖ నటులు, సింగర్స్, నృత్యకారులు పాల్గొని ప్రదర్శన ఇస్తారు.అయితే ఈ సారి అలాంటి వేడుకలు ఏమి ఉండవు. గత ఐపీఎల్ 18 విజేతగా నిలిచి ఆర్‌సీబీ టోర్నీ చరిత్రలోనే తొలి ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించగా.. ఆ సమయంలో చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో తాజా టోర్నీ ప్రారంభ వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది.

కాగా, గత ఏడాది తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మందికి నివాళులర్పించేందుకు ఈసారి ఆర్‌సీబీ ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఒక నిమిషం మౌనం పాటించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు వారి జ్ఞాపకార్థం స్టేడియంలోని 11 సీట్లు శాశ్వతంగా ఖాళీగా ఉంచాలని నిర్ణయించింది. ఎల్లుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగుతున్న ఆర్సీబీ గెలుపే లక్ష్యంలో బరిలోకి దిగుతుండగా.. ఆర్‌సీబీకి షాకి ఇచ్చి తొలి మ్యాచ్ లో విజయంతో టోర్నీని షురూ చేయాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ యోచిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>