Mobile Popup Ad
Mobile Popup Ad

గ్యాస్ కోసం రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు.. లక్డీకాపూల్‌లో టెన్షన్ టెన్షన్

కలం, తెలంగాణ బ్యూరో: గ్యాస్, పెట్రోల్ కొరత రాష్ట్రాన్ని వెంటాడుతున్నది. కొరత లేదని అధికారులు చెప్తున్నప్పటికీ.. గ్రౌండ్ లెవల్ లో మాత్రం సీన్ వేరే తీరుగా ఉంది. ఎక్కడికి వెళ్లినా నోస్టాక్ (No Stock) బోర్డులు దర్శనమిస్తున్నాయి. గత వారం పది రోజులుగా సీఎన్జీ (CNG) ఆటో డ్రైవర్లు (Auto Drivers) తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఓపిక నశించి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని లక్డీకాపూల్(Lakdikapul)లో రోడ్డెక్కారు. దీంతో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఇప్పటికే పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొన్నది. దీనికి తోడు ఆటో డ్రైవర్ల ఆందోళనలతో మరింత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

గ్యాస్ (Gas), పెట్రోల్ (Petrol) దొరక్క ఆటోలను నడపలేకపోతున్నామని, తమకు ఉపాధి కరువైందని ఆటో డ్రైవర్లు (Auto Drivers) ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటలకు వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడం లేదని వారు వాపోయారు. ఇప్పటి వరకు తమను ఆదుకుంటామని ఎవరూ ముందుకు రావడం లేదని.. ఆటోలు రోడ్డెక్కక తమ ఇళ్లలో పూటగడవడం కష్టంగా మారిందని తెలిపారు. ఆటోల్లో గ్యాస్ నింపించుకునేందుకు బంక్ ల వద్ద గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నదని.. చాలా బంక్ లు నోస్టాక్ బోర్డులు పెట్టేశాయని ఆటో డ్రైవర్లు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>