భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు!

క‌లం, వెబ్ డెస్క్‌: అంత‌ర్జాతీయ మార్కెట్‌లో వ‌స్తున్న మార్పుల‌తో మ‌రోసారి బంగారం, వెండి ధ‌ర‌లు (Gold Silver Prices) భారీగా పెరుగుతున్నాయి. బుధ‌వారం 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.3,980 పెరిగింది. ఇక వెండి ధ‌ర సైతం మ‌రింత పైపైకి వెళ్తోంది. ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే కిలో వెండి ధ‌ర రూ.10 వేలు పెరిగింది. హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర   రూ.1,49,840గా ఉండ‌గా బుధ‌వారం రూ.3,980 పెరిగి రూ.1,53,820కి చేరుకుంది.

మ‌రోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర మంగ‌ళ‌వారం రూ.1,37,350గా ఉండ‌గా బుధ‌వారం రూ.3,650 పెరిగి ప్ర‌స్తుతం రూ.1,41,000కు చేరుకుంది. ఇక కిలో వెండి ధ‌ర మంగ‌ళ‌వారం రూ.2,55,000 ఉండ‌గా నేడు రూ.2,65,000కు చేరుకుంది. అంతర్జాతీయ ప‌రిస్థితులు, గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో మార్పుల‌కు అనుగుణంగా ధ‌ర‌ల్లో (Gold Silver Prices) మ‌ళ్లీ మార్పులు రావొచ్చ‌ని నిపుణులు భావిస్తున్నారు.

Read Also: అకీరా బ‌ర్త్‌డే… ప‌వ‌న్ భార్య ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>