కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్బీఐ గవర్నర్ (RBI Governor) సంజయ్ మల్హోత్రా కలిశారు. బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు ఆయన గురువారం హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను రేవంత్ రెడ్డి ఆర్బీఐ గవర్నర్ కు వివరించారు. ప్రశంసించారు. విద్యుత్ రంగం, రాష్ట్రంలో సోలార్ వినియోగం, ఆర్థిక విధానాలను ప్రశంసించిన ఆర్బీఐ గవర్నర్ (RBI Governor). మరిన్ని సంస్కరణలు, ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
అలాగే, తెలంగాణలో BUDS (Banning of Unregulated Deposit Schemes) యాక్ట్ ను నోటిఫై చేయాలని ఆర్బీఐ గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ ఫేస్ (ULI) విషయంలో ఆర్బీఐ తీసుకుంటున్న చొరవతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు డిపాజిట్ల క్లెయిమ్ క్యాంపెయినింగ్ తదితర అంశాలను సంజయ్ మల్హోత్రా వివరించారు. ఈ సమావేశంలో సీఎస్ కే.రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


