దేశ ఆర్థిక స్థితికి 4 శాతం ద్రవ్యోల్బణమే కరెక్ట్: పూనమ్ గుప్తా

కలం, వెబ్‌ డెస్క్ : దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులకు అనుగుణంగా 4 శాతం ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అత్యంత సమంజసమని భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా (Poonam Gupta) స్పష్టం చేశారు. తలసరి ఆదాయం, ఆర్థిక వ్యవస్థ పరిమాణం లేదా సంక్లిష్టత వంటి ఏ కోణంలో చూసినా భారత్ సరైన దిశలోనే ఉందని ఆమె పేర్కొన్నారు. గత పదేళ్ల కాలంలో సగటు ద్రవ్యోల్బణం 4.5 శాతంగా నమోదైందని విశ్లేషించారు. కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో ద్రవ్యోల్బణం 6 శాతానికి మించిందని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిమితిని తగ్గించాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>