Mobile Popup Ad
Mobile Popup Ad

టీవీకే విజయ్ కెరీర్ నిలబెట్టిన నిర్మాత మృతి

కలం, వెబ్ డెస్క్ : సినీ రంగంలో విషాదం నెలకొంది. సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత, ప్రముఖ సినీ నిర్మాత ఆర్బీ చౌదరి( RB Choudary ) మృతి చెందారు. ఉదయపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఆర్బీ చౌదరి సూపర్ గుడ్ ఫిలింస్ పేరుతో నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, ప్రియమైన నీకు, స్నేహమంటే ఇదేరా, రచ్చ, గాడ్ ఫాదర్, సూర్యవంశం, సుస్వాగతం తదితర చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం విశాల్ హీరోగా ఆర్బీ చౌదరి తన 99వ సినిమా మకుటం అనే పేరుతో తీస్తున్నారు. కాగా, ఆయన ఇద్దరు కొడుకులు జీవా, జితన్ రమేశ్ కూడా సినీ నటులుగా ఉన్నారు.

తెలుగు, తమిళ్ లో అనేక సినిమాలు తీసిన ఆర్బీ చౌదరి (RB Choudary) టీవీకే అధినేత, దళపతి విజయ్ తో కలిసి బ్లాక్ బస్టర్ చిత్రాలను తీశారు. ఓ రకంగా విజయ్ సినీ కెరీర్ ను ఆర్బీ చౌదరి నిలబెట్టారనే చెప్పొచ్చు. వీరిద్దరి కాంబినేషన్ లో పూవే ఉనక్కాగా (1996) , లవ్ టుడే (1997), తుళ్ళాత మనముమ్ తుళ్ళుమ్ (1999), షాజహాన్ (2001), తిరుపాచ్చి (2005), జిల్లా (2014) చిత్రాలు వచ్చాయి.

Read Also: సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>