జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: యెన్నం

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) తెలిపారు. పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న నమస్తే తెలంగాణ సీనియర్ జర్నలిస్టు దయాకర్‌కు, అలాగే ఇటీవల విధి నిర్వహణలో మరణించిన సీనియర్ జర్నలిస్టు దాసరి నర్సింహులు కుటుంబానికి యెన్నం ఆర్థిక సహాయం అందజేశారు. ఇద్దరు జర్నలిస్టు కుటుంబ సభ్యులకు పదివేల రూపాయల చొప్పున చెక్కులను పాలమూరు జర్నలిస్టు సంక్షేమ సంఘం తరపున ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా యెన్నం (MLA Yennam) మాట్లాడుతూ.. జర్నలిస్టు సోదరులకు , వారి కుటుంబ సభ్యులకు ప్రైవేటు ఆసుపత్రులలో ఉచిత ఓపీని అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్, కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, కోశాధికారి రఘు, నాయకులు రమాకాంత్, సతీష్, తిరుపతయ్య, జనార్థన్, రాము, క్యూ న్యూస్ రఘు, సతీష్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

Read Also: శ్రీరాముడిపై కొండా సురేఖ వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీజేపీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>