Mobile Popup Ad
Mobile Popup Ad

వాషింగ్టన్ సుందర్‌కు సరైన పాత్ర ఇవ్వట్లేదు: అశ్విన్

కలం, స్పోర్ట్స్​ : టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) వినియోగంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో అతడికి వరుస అవకాశాలు ఇస్తున్నప్పటికీ, సరైన పాత్ర మాత్రం ఇవ్వడం లేదని అభిప్రాయపడ్డాడు. దీంతో సుందర్ ప్రతిభ పూర్తిగా బయటపడటం లేదని పేర్కొన్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో సుందర్ ఒకే ఓవర్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌లో వికెట్ తీయలేక 19 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్‌లోనూ ఆరో స్థానంలో వచ్చి 12 బంతుల్లో 9 పరుగులే చేసి నిరాశపరిచాడు.

భారత్ 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 148 పరుగులకే ఆలౌట్ కావడంతో, ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం తన యూట్యూబ్ కార్యక్రమంలో మాట్లాడిన అశ్విన్, సుందర్‌కు జట్టులో స్థానం పక్కాగా ఉన్నా, అతడి బాధ్యతలపై స్పష్టత కనిపించడం లేదని చెప్పాడు. కొన్ని మ్యాచ్‌ల్లో అతడికి ఒక్క ఓవర్ మాత్రమే ఇస్తున్నారని, మరికొన్ని మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసే అవకాశం కూడా దక్కడం లేదని వివరించాడు.

బ్యాటింగ్ విషయంలోనూ సుందర్‌ను ఫినిషర్‌గా ఉపయోగించడం సరైన నిర్ణయం కాదని అశ్విన్ (Ashwin) అభిప్రాయపడ్డాడు. అతడు ఫినిషర్ కాదని, పరిస్థితికి అనుగుణంగా బ్యాటింగ్‌కు పంపే ‘ఫ్లోటర్’ పాత్రలో ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించాడు. గతంలో రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్​ కలిసి అక్సర్ పటేల్‌ను ఉపయోగించిన విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించాడు. అలాగే ప్రపంచకప్ సమయంలో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో అక్షర్ స్థానంలో సుందర్‌ను ఆడించడం కూడా జట్టు అతడిపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని గుర్తు చేశాడు.

Read Also: పిల్లలు నిద్రపోయే ముందు తల్లిదండ్రులు చేయకూడని పొరపాట్లు ఇవే!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>