Mobile Popup Ad
Mobile Popup Ad

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న “బాహుబలి ది టార్చ్ బేరర్”

కలం, వెబ్ డెస్క్: ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించింది బాహుబలి. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ చిత్రాలు రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించి మరే సినిమా అందుకోలేని బెంచ్ మార్క్ క్రియేట్ చేశాయి. బాహుబలిగా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రపంచస్థాయిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఈ పేరు, గుర్తింపు ఊరికే రాలేదని బాహుబలి మేకింగ్ డాక్యుమెంటరీ బాహుబలి ది టార్చ్ బేరర్ (Baahubali The Torch Bearer) చూస్తే తెలుస్తోంది. బాహుబలి కోసం ప్రభాస్ పడిన శ్రమ, ఈ సినిమా కోసం తన కెరీర్ నే పణంగా పెట్టిన అంకితభావం, కష్టం చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఐదేళ్లు బాహుబలి కోసం ప్రభాస్ టైమ్..

తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఐదేళ్లు బాహుబలి కోసం టైమ్ కేటాయించడం, ఈ సినిమా తప్ప మరే ప్రాజెక్ట్ చేయకపోవడం, హార్స్ రైడింగ్, స్వార్డ్ ఫైటింగ్, హిల్ క్లైంబింగ్, భారీ వార్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం.. ఇలా ఎంతో శ్రమించారు ప్రభాస్. ఈ సినిమా కోసం స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యారు. ఇలా ప్రభాస్ చేసిన ఎన్నో త్యాగాలతో బాహుబలి రూపుదిద్దుకుంది. ఇలా తాను కష్టపడుతూనే దర్శకుడు రాజమౌళికి ప్రోత్సాహం అందిస్తూ, మోరల్ సపోర్ట్‌గా నిలిచారు ప్రభాస్. ఈ విషయాన్ని రాజమౌళి ఎన్నో ఇంటర్వ్యూస్‌లో చెప్పుకున్నారు.

అందరి కంటే ఎక్కువగా బాహుబలి కాన్సెప్ట్‌ను, రాజమౌళి విజన్‌ను నమ్మారు ప్రభాస్. అందుకే ఆయన ఈ సినిమా కోసం ఎంత శ్రమైనా తీసుకున్నారు. తన నమ్మకంతో ప్రభాస్ మిగతా టీమ్‌లోనూ ఆ స్ఫూర్తిని నింపారు. ఎవరెంత కష్టపడినా ప్రభాస్ బాహుబలికి ఫేస్ ఆఫ్ ది మూవీ. ఆయన తన వందశాతం ఇవ్వడం వల్లే మిగతా మొత్తం సినిమాకు పేరొచ్చింది. ప్రభాస్ ఒక్కరి కష్టం ఆయనతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లింది. త్వరలో బాహుబలి 3కి సన్నాహాలు జరుగుతున్నాయనే న్యూస్ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు సంతోషాన్నిస్తోంది.

Read Also: పిల్లలు నిద్రపోయే ముందు తల్లిదండ్రులు చేయకూడని పొరపాట్లు ఇవే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>