Mobile Popup Ad
Mobile Popup Ad

వరుస సినిమాలతో రవితేజ రచ్చ షురూ..!

కలం, వెబ్ డెస్క్ : మాస్ మహారాజా రవితేజ ( Ravi Teja) ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఇరుముడి’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తర్వాత రవితేజ మరో రెండు ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్‌‌టైనర్ చేయడానికి రవితేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండడం విశేషం. నిజానికి ఈ స్టోరీని వివేక్ ఆత్రేయ బాలకృష్ణతో తీయాల్సి ఉంది. కానీ బాలకృష్ణ ఇతర కమిట్‌మెంట్లతో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ రవితేజ చేతిలోకి వెళ్లిందని టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు హసిత్ గోలి దర్శకత్వంలో మాస్ రాజా ఓ సినిమా చేయనున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి సినిమాల షూటింగ్స్ ఏకకాలంలో జరగనున్నాయని.. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వస్తాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా మాస్ మహారాజా తనదైన స్పీడ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమా అనౌన్స్‌మెంట్లతో ఫ్యాన్స్ ను ఖుషీ చేయబోతున్నారని తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>