రవితేజ ‘ఇరుముడి’ మూవీ బిగ్ అప్డేట్..

కలం, సినిమా : మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) ఈసారి ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ అందించనున్నారు. గత కొంతకాలంగా రొటీన్ కథలతో ఫ్యాన్స్‌ని నిరాశపరిచిన రవితేజ.. ఈ సారి సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ (Shiva Nirvana) డైరక్షన్ లో రవితేజ “ఇరుముడి”(Irumudi), అనే సినిమా చేస్తున్నారు. రవితేజ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. అయ్యప్ప మాలలో రవితేజ లుక్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

ఈ సరికొత్త కథాంశాన్ని మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తుంది. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ జివి ప్రకాష్‍ కుమార్‍ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. రేపు (గురువారం) 4.05 గంటలకు “ఇరుముడి” నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>