సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: మంత్రి డోలా

కలం, వెబ్ డెస్క్: సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి (Minister Dola Sri Bala Veeranjaneyaswamy) స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో మంత్రి అధ్యక్షతన సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా వయోవృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతపై చర్చించారు. సీనియర్ సిటిజన్స్ సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వాట్సప్ మన మిత్ర ద్వారా సీనియర్ సిటిజన్ కార్డులు ఉచితంగా ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల పట్ల వృద్ధులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. వృద్ధాశ్రమాల్లో వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయాలని వివరించారు. 2036 నాటికి రాష్ట్రంలో ప్రతి 5 మందిలో ఒకరు వృద్ధుడు ఉంటారని మంత్రి తెలిపారు. దీన్ని అధిగమించేందుకే సీఎం చంద్రబాబు పాపులేషన్ మేనేజ్ మెంట్ పాలసీకి శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ, సీట్ల కేటాయింపు పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>