కలం, సినిమా : మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’(Irumudi). టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ(Shiva Nirvana) తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా, 2026 ఆగష్టులో థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్‌ను రవితేజ కెరీర్‌లో ఒక “కంబ్యాక్ ఫిల్మ్”గా భావిస్తున్నారు. ఇటీవల రవితేజ నటించిన సినిమాలు ఆశించిన విజయం అందుకోలేదు. దీనితో ఈసారి భారీ విజయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని బలమైన కథాంశంతో రూపొందిస్తున్నట్లు సమాచారం.
‘ఇరుముడి’ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రవితేజ ఎనర్జీ, మాస్ అప్పీల్‌ను మరోసారి పెద్ద స్క్రీన్‌పై చూపించేందుకు టీమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 2026 రిలీజ్ టార్గెట్‌తో వస్తున్న ‘ఇరుముడి’పై ఇప్పటికే అభిమానులలో మంచి అంచనాలు నెలకొన్నాయి.

