కేయూలో ఎలుకల స్వైరవిహారం.. 14 మంది విద్యార్థినులకు గాయాలు

కలం, వెబ్ డెస్క్: వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) సమ్మక్క-సారలమ్మ విద్యార్థినుల హాస్టల్‌లో ఎలుకలు స్వైరవిహారం చేశాయి. అర్ధరాత్రి నిద్రలో ఉన్న సుమారు 14 మంది విద్యార్థినులను ఎలుకలు (Rats) కొరికాయి. దీంతో అమ్మాయిలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాయపడిన విద్యార్థినులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యూనివర్సిటీ హాస్టళ్లలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు పదేపదే పునరావృతమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ గదుల్లో శుభ్రత పాటించాలని నిరసన వ్యక్తం చేశారు. ఎలుకల బెడద నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కాగా, మరోవైపు కేయూలో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. విశ్వవిద్యాలయ (Kakatiya University) ప్రాంగణంలోని హాస్టళ్లు, విభాగాలు, పరిసరాల్లో ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోయింది. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దీనివల్ల దోమల బెడద పెరిగి విద్యార్థులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది.  అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే క్యాంపస్ అధ్వాన్నంగా తయారైందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Read Also: బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.. కేటీఆర్, హరీశ్‌పై విప్ వేముల ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>