ఆపిల్ జాబ్ వదిలి, ఆటో డ్రైవర్‌గా మారి.. రియల్ హీరో రాకేశ్!

కలం, వెబ్ డెస్క్: Bengaluru  Rakesh | లగ్జరీ లైఫ్.. లక్షల్లో జీతం.. ఇవేమీ అతడికి సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వలేకపోయాయి. కంప్యూటర్‌తో కుస్తీ, డెడ్‌లైన్లు, రొటీన్ లైఫ్.. అన్నింటికి మించి కార్పొరేట్ బానిసత్వం. ఇలాంటి జీవితం నుంచి బయటపడాలనుకున్నాడు. వెంటనే ఆపిల్ జాబ్ వదిలి ఆటో డ్రైవర్‌గా (Auto Driver) మారాడు. లక్షల జీతం వదులుకొని సాధారణ ఉద్యోగం చేస్తున్న ఇతడి స్టోరీ.. ఇప్పుడు చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. రాకేశ్ కెరీర్ ఆపిల్ లాంటి దిగ్గజ సంస్థలో భారీ జీతంతో మొదలైంది. విలాసవంతమైన వసతుల మధ్య ఉద్యోగం చేశాడు. ప్రముఖ బ్యాంకులు, ఇతర టెక్ సంస్థల్లో పనిచేస్తూ అందరూ కలలుగనే జీవితాన్ని గడిపారు. అయితే.. పైకి కనిపిస్తున్న ఆ హోదా రాకేశ్‌లో ఓ రకమైన శూన్యతను, అసంతృప్తిని మిగిల్చింది. కార్పొరేట్ ప్రపంచంలో మనుషులను కేవలం వనరులుగానే చూస్తారని, ఇతరులను మెప్పించే క్రమంలో తనను తాను మర్చిపోయానని గ్రహించాడు. అన్ని సౌకర్యాలు ఉన్నా మనసులో ప్రశాంతత కరువవ్వడంతో తనను తాను ప్రశ్నించుకున్నాడు.

వృత్తిపరమైన ఒత్తిళ్లే కాకుండా కుటుంబ సభ్యులు, వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు మానసికంగా కుంగదీశాయి. దీనివల్ల ఆయన తీవ్రమైన నిరాశలోకి వెళ్లాడు. సుదీర్ఘకాలం పాటు యాంటీ డిప్రెసెంట్ మందులపై ఆధారపడ్డారు. గంటల తరబడి ఒకే చోట కూర్చుని ఒకే ఆలోచనతో గడిపాడు. వెంటనే ఈ పరిస్థితి నుండి బయటపడాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం సైకాలజీని అధ్యయనం చేస్తూ, మనుషుల ప్రవర్తనలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో శారీరక దృఢత్వంపై దృష్టి సారించి 15 కిలోల బరువు తగ్గారు. మార్షల్ ఆర్ట్స్‌లో ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. అలా తనపై తనకు నమ్మకాన్ని తిరిగి పొందాడు.

రాకేష్ ఇప్పుడు బెంగళూరు (Bengaluru)లో తన ఎలక్ట్రిక్ ఆటోను నడుపుతున్నాడు. డ్రైవింగ్‌తో పాటు, నృత్యం, చిత్రలేఖనాన్ని కూడా నేర్చుకుంటున్నాడు. ఫుడ్ డెలివరీ చేయడం, బైక్ టాక్సీ నడపడం, జిమ్ అసిస్టెంట్‌గా నేలలు, టాయిలెట్లు శుభ్రం చేయడం వరకు లాంటివన్నో చేశాడు. ‘ఏ పనీ నాకు తక్కువగా అనిపించేది కాదు. ప్రతి ఉద్యోగం ఎంతో కొంత నేర్పిస్తోంది. జీవితం అంటే జీతమే కాదు కదా..’ అని అంటున్నాడు రాకేశ్.

Read Also: పాకిస్థాన్‌లో 80 శాతం మంది స్వలింగ సంపర్కులే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>