కలం, వెబ్ డెస్క్: స్త్రీ శరీరంలో ఉండే ప్రత్యుత్పత్తి వ్యవస్థ గర్భాశయం. ఈ అవయవం ద్వారానే సంతానోత్పత్తి జరుగుతుంది. కానీ వికారాబాద్ జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడి శరీరంలో గర్భాశయం గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. పరిగిలోని ఛత్రజీ ఆస్పత్రిలో 17 ఏళ్ల బాలుడికి ఈ అరుదైన ఆపరేషన్ (Rare Surgery) నిర్వహించారు.
సాధారణంగా పురుషుల్లో ఉండని స్త్రీ పునరుత్పత్తి అవయవాలు బాలుడి శరీరంలో గుర్తించడంతో వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. కడుపునొప్పితో వచ్చిన ఆ బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో గర్భాశయం ఉన్నట్లు తెలిసింది. అనంతరం గర్భాశయాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్న వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తిచేశారు. పర్సిస్టెంట్ ముల్లెరిన్ డక్ట్ సిండ్రోమ్ అనే జన్యుపరమైన సమస్య కారణమని వైద్యులు చెబుతున్నారు.
Also Read : వార్ రూం నుంచే విధులు.. అధికారులకు భట్టి కీలక ఆదేశాలు
Follow Us On : WhatsApp

