దీక్షా దివస్ సభపై బీఆర్ఎస్ నాయకుల సమీక్ష

కలం, కరీంనగర్: ఈ నెల 29వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ (Deeksha Diwas) కార్యక్రమ ఏర్పాట్లను పార్టీ నాయకులు పరిశీలించారు. అనంతరం మానకొండూర్‌లోని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ నివాసంలో నాయకులతో సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, దీక్షా దివస్ సభ ఇన్‌చార్జి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ రావు, నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రొడ్డవేణి మధు, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు జమీల్ ఉద్దీన్, బీఆర్ఎస్ కొత్తపల్లి మండల శాఖ అధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పిల్లి మహేష్ గౌడ్, మైనారిటీ కరీంనగర్ నగర అధ్యక్షుడు మీర్ సౌకత్ అలీతో పాటు అలుగునూరు, మానకొండూర్ ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>