కలం, నిర్మల్: రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాది అని, దేశంలో ప్రజలే అంతిమ అధికారులని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గురువారం నిర్వహించిన ‘సంవిధాన్ గౌరవ్ దివస్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారతదేశానికి ఉందని, ‘భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాం’ అనే రాజ్యాంగ పీఠికలోని వాక్యాలు ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ అధికారమని చాటుతున్నాయని అన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని ఏలేటి (MLA Alleti) కొనియాడారు.
అంబేద్కర్‌కు సముచిత గౌరవం కల్పించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ప్రస్తావించారు. రాజ్యాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రజాస్వామ్య విలువలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

