Mobile Popup Ad
Mobile Popup Ad

ఎనిమిది గంట‌ల ప‌నిపై దీపికాకు ర‌ణ్‌వీర్ కౌంట‌ర్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) త‌న‌ భార్య‌ దీపికా ప‌దుకొణెపై ప‌రోక్షంగా సెటైర్లు వేశారు. ధురందర్ సక్సెస్ సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గ‌తంలో దీపికా ప‌దుకొణె (Deepika Padukone) చేసిన 8 గంట‌ల ప‌ని వ్యాఖ్య‌ల‌పై కౌంట‌ర్ ఇచ్చారు. దీపికా సినిమాల‌కు వ‌ర్క్ చేసే ప‌ని గంట‌ల‌పై మాట్లాడుతూ 8 గంట‌లే ప‌ని చేయాల‌ని, అంత‌కు మించి ప‌ని చేయ‌డం స‌రికాద‌ని చెప్పింది. దీపికా వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో, సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో పెద్ద చ‌ర్చ‌కు తెర‌లేపాయి. కొంద‌రు దీపిక‌ను స‌పోర్ట్ చేస్తూ మాట్లాడ‌గా, మ‌రికొంద‌రూ తీవ్రంగా విమ‌ర్శించారు. ఇక తాజాగా దీనిపై రణ్‌వీర్ సింగ్ స్పందిస్తూ ఒకవేళ ఎనిమిది గంటల్లో పని పూర్తి కాకపోయినా, లేదా నిర్మాత దగ్గర సమయం తక్కువగా ఉన్నా మరికొంత సమయం అదనంగా పని చేయడంలో తప్పేముంద‌ని ప్ర‌శ్నించారు. పని పట్ల అంకితభావంతో ఉండాల‌ని రణ్‌వీర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భార్యాభ‌ర్త‌లు ఒకే ఫీల్డ్‌లో ప‌ని చేస్తూ, భిన్న అభిప్రాయాలు క‌లిగి ఉండ‌టంపై నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. మ‌రి దీపికా దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>