డ్రగ్స్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: PDSU

కలం, వనపర్తి : జిల్లాలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని PDSU జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు PDSU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ అధికారి లింగయ్య చారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్ల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు.

జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు, యువతకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడంతో పాటు, వాటికి బానిసైన వారికి వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. ఎక్సైజ్, పోలీస్, విద్యాశాఖలు సమన్వయంతో పనిచేసి వనపర్తి జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో PDSU నాయకులు దీవెన్ కుమార్, ప్రశాంత్, గురుచరణ్, IFTU ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి జమ్మిచేడు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>