Mobile Popup Ad
Mobile Popup Ad

బైక్‌ను ఢీకొట్టి.. రెండు కిలోమీట‌ర్లు ఈడ్చుకెళ్లి.. కారు బీభ‌త్సం!

క‌లం, వెబ్ డెస్క్‌: రంగారెడ్డి (Rangareddy) జిల్లాలో ఓ కారు బీభ‌త్సం సృష్టించింది. బైక్‌ను ఢీకొట్టి రెండు కిలో మీట‌ర్ల మేర ఈడ్చుకెల్లింది. దీంతో బైక‌ర్‌తో పాటు వెనుక కూర్చున్న మ‌రో వ్య‌క్తికి తీవ్ర గాయాల‌య్యాయి. మైలార్‌దేవ్‌ప‌ల్లి స‌మీపంలో సోమ‌వారం తెల్ల‌వారుజామున‌ ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కారు పల్లం చెరువు నుంచి చాంద్రాయణగుట్ట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంట‌నే స్థానికులు అప్ర‌మ‌త్త‌మై కారు డ్రైవ‌ర్‌ను వెంబ‌డించి చిత‌క‌బాదారు. అత‌డిని పోలీసుల‌కు అప్ప‌గించారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>