ఓటు చోరీతోనే గెలిచారా?: కాంగ్రెస్‌పై రామచందర్ రావు ఫైర్!

కలం, వెబ్ డెస్క్ : ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ పై ప్రతిపక్షాలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) మండిపడ్డారు. ముఖ్యంగా ఫామ్ 6, 7 లపై ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఫామ్ 7 సమర్పించినంత మాత్రాన నేరుగా ఓటు తొలగించబడదని, సరైన విచారణ తర్వాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే ఓటు చోరీతోనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎంపీలుగా గెలిచారా? కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చింది కూడా ఓట్ల చోరీతోనేనా? అని కాంగ్రెస్ ను రామచందర్ రావు నిలదీశారు. గతంలో 12 సార్లు వర్చువల్ ఓటర్ సవరణ జరిగినప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ చట్టవిరుద్ధమేనా? అని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలిస్తే ఈసీ మంచిదని, ఓడిపోతే ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు.

అంతేకాదు ఈవీఎం వ్యవస్థను దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టింది నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వమేనని రామచందర్ రావు గుర్తుచేశారు. చట్టబద్ధంగా ఫామ్ 7 ఇచ్చే హక్కు రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లకు ఉంటుందని, అలాంటప్పుడు ముషీరాబాద్‌లో బీజేపీ బీఎల్ఎలపై కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని, ఓటమి భయంతోనే విపక్షాలు రాజ్యాంగబద్ధ సంస్థలపై అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>