బిగ్ యాక్షన్: జమ్మూ కశ్మీర్‌లో అక్రమ నివాసితుల బహిష్కరణ!

కలం, వెబ్ డెస్క్ : జమ్మూ కశ్మీర్‌లో సరియైన పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిబంధనలు ఉల్లంఘించి ఉంటున్న 150 మంది బంగ్లాదేశ్ పౌరులను (Bangladesh Immigrants) భారత్ బహిష్కరించింది. వీరందరినీ శ్రీనగర్ నుంచి ప్రత్యేక భారత వైమానిక దళం (IAF) విమానంలో పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రాకు తరలించారు.

బాగ్డోగ్రా చేరుకున్న అనంతరం, ఆ వ్యక్తులను సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారులకు అప్పగించారు. అక్కడి నుంచి అంతర్జాతీయ సరిహద్దు మార్గం ద్వారా వారిని తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించే ప్రక్రియను బిఎస్ఎఫ్ వేగవంతం చేసింది. జమ్మూ కశ్మీర్ పరిధిలో అక్రమ నివాసిత ప్రాంతాలు, గుర్తింపు కార్డుల తనిఖీల ఆధారంగా చేపట్టిన ప్రత్యేక ప్రచారంలో ఈ అక్రమ వలసదారులను గుర్తించారు. సరిహద్దు భద్రత, దేశీయ శాంతిభద్రతల దృష్ట్యా ఇటువంటి అక్రమ వలసదారులపై నిరంతరం చర్యలు కొనసాగుతాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>