Mobile Popup Ad
Mobile Popup Ad

కవిత వల్ల నాశనం అయ్యేది బీజేపీ కాదు.. ఆ పార్టీనే : రామచందర్ రావు

కలం, డెస్క్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) కొద్ది సేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ.. తాను మే నెలలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను పార్టీ పెడితే బీజేపీ నాశనం అవుతుంది అంటూ ఓ మాట చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ తెలంగాణ చీఫ్‌ రామచందర్ రావు (Ramchander Rao) మాట్లాడుతూ.. ‘కవిత పార్టీ పెడితే నాశనం అయ్యేది బీజేపీ కాదని.. బీఆర్ ఎస్ అన్నారు. ఆమె పొరపాటున బీఆర్ ఎస్ అనబోయి బీజేపీ అన్నట్టున్నారని చెప్పుకొచ్చారు.

బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రమచందర్ రావు (Ramchander Rao) మీడియాతో మాట్లాడారు. శివాజీ స్ఫూర్తితో తెలంగాణలో ప్రజా వ్యతిరేక పార్టీలపై పోరాడుతామన్నారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ (BJP) అధికారంలోకి వస్తుందని.. అందుకు తమ పార్టీకి పెరుగుతున్న ఓటు శాతమే నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు రామచందర్ రావు.

Read Also: రైతులకేదీ భరోసా?.. సాయం కోసం ఎదురుచూపులు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>