జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది: రామ్‌చందర్ రావు

కలం, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్ రావు (Ramchander Rao) ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో మోర్చాల అధ్యక్షులు, ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణ, ఐక్యతతో బూత్ స్థాయిలో పని చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీలో డీలిమిటేషన్ తర్వాత వార్డుల సంఖ్య 300కి పెరిగిందని, ఆ సంఖ్య 350 వరకు పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌ నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని.. ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీశ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడంతో తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>