విద్యార్థి సంఘాల ఎన్నికలను స్వాగతిస్తున్నా: మంత్రి పొన్నం

కలం, వెబ్ డెస్క్ : విద్యాకమీషన్ (Education Commission) ఇచ్చిన నివేదికను సైతం రాజకీయం చేయడం సిగ్గుచేటని.. విద్యాకమిషన్ ఇచ్చిన నివేదికపై కూడా రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. సిద్దిపేట (Siddipet) జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.

యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి. ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నానని, వచ్చే విద్యా సంవత్సరం నుండి యూనివర్సిటీల్లో ఎన్నికలు నిర్వహించే విధంగా అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్నికలు నిర్వహించి నూతన నాయకత్వం వస్తే, రాజకీయాలలో నూతన తరం వచ్చే అవకాశం ఉంటుందని, యూనివర్సిటీలలో ఎన్నికలు లేకపోతే నేను మంత్రి స్థాయికి చేరే వాన్ని కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలన్నా, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా యువ నాయకత్వం చాలా కీలకమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) అన్నారు.

Read Also: యాదాద్రిలో ఘోరం.. సుత్తితో కొట్టి భర్తను చంపిన భార్య

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>