సింగరేణి స్కూల్‌కు నూతన బస్!

కలం, కరీంనగర్ బ్యూరో: గోదావరిఖని ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో సింగరేణి స్కూల్‌ (Singareni School)కు స్పాన్సర్ చేసిన నూతన స్కూల్ బస్‌ను శుక్రవారం సెక్టర్-2లోని సింగరేణి స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని స్కూల్ బస్‌ను అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు పాఠశాలకు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు ఈ బస్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని విధాలుగా సహకరించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. సింగరేణి స్కూల్‌కు స్కూల్ బస్‌ను స్పాన్సర్ చేసిన గోదావరిఖని ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్, స్థానిక కార్పొరేటర్ కాల్వల పద్మావతి, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>