నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) అత్యవసర సమావేశం (CWC Meeting) కానుంది. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ ప్రారంభమవుతుంది. ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.

ఈ భేటీలో ప్రధానంగా ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ, ఓట్ల చోరీ వ్యవహారాలపై సీడబ్ల్యూసీ సుదీర్ఘంగా చర్చించనుంది. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఈ సమావేశంలో ప్రత్యేక తీర్మానం చేసే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ (EC) తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు రాబోయే ‘ఇండి’ (INDIA) కూటమి సమావేశంలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై కూడా ఖర్గే, ఇతర అగ్రనేతలు దిశానిర్దేశం చేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>